మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ అని అందరూ భావిస్తారు. అయితే దీర్ఘకాలంలో అవి చాలా ప్రయోజనకరంగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లోని ‘కాంపౌండింగ్’ సామర్థ్యం వల్ల ఊహించని రాబడులు దీర్ఘకాలంలో వస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా. ర్యాపిడ్ వేగంతో మీ పెట్టుబడులను పెంచేసే శక్తి ఈ మ్యూచువల్ ఫండ్స్ లోని కాంపౌండింగ్ కు ఉంది. అందుకే దీనిని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ లేదా మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్ అని పిలుస్తారు. ఈ మ్యాజిక్ తో కేవలం రూ. 1లక్ష పెట్టుబడితో కోటీశ్వరులను చేసిన ఓ మ్యూచువల్ ఫండ్ గురించి వివరిస్తున్నాం. దానిలో ఒక వ్యక్తి రూ. 1లక్ష పెట్టుబడి పెట్టగా.. అది 28 సంవత్సరాలలో ఏకంగా 3.4కోట్ల రాబడిని అందించింది. ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పేరు హెచ్‌డీఎఫ్‌సీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి అర్థం కావాలంటే ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పేరు హెచ్‌డీఎఫ్‌సీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్. దీనిలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ఇప్పుడు కోటీశ్వరులైపోయారు. ఒక వ్యక్తి 28ఏళ్ల క్రితం రూ. 1లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు అది రూ. 3.4కోట్లను అందించింది. దీని రాబడి ఏడాదికి ఎలా ఉంది అని చూస్తే.. రూ. 1లక్ష పెట్టుబడి పెట్టగా మొదటి ఏడాది 45.38శాతం రిటర్న్స్ ఇవ్వగా.. ఆ మొత్తం రూ. 1.45లక్షలకు చేరింది. మూడేళ్లకు 26.62శాతం రాబడితో మొత్తం 2.03 లక్షలకు చేరింది. అలాగే ఐదేళ్లకు 22.37శాతం రాబడితో మొత్తం 2.74లక్షలకు చేరింది. పదేళ్లకు 14.47శాతం రాబడితో మీకు మొత్తం 3.86లక్షలకు చేరింది. అదే మొత్తం 28 ఏళ్లలో 22.84శాతం రాబడితో 3.41కోట్లకు చేరింది.
ఈ పథకం గురించిన పూర్తి వివరాలు ఒకసారి గమనిస్తే.. ఈ పథకం మార్చి 31, 1996న ప్రారంభమైంది. ఈ పథకంలోని టాప్ 10 హోల్డింగ్‌లు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ వంటివి ఉన్నాయి. దీనిలో కనిష్ట ఎస్ఐపీ రూ. 500 , స్కీమ్ బెంచ్‌మార్క్ నిఫ్టీ 500 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ (టీఆర్ఐ). పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం) రూ. 16,422 కోట్లు. రోషి జైన్, ధ్రువ్ ముచ్చల్ ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..