Personal Loan: పర్సనల్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారా..? ఏ బ్యాంకులో వడ్డీ రేటు తక్కువగా ఉందంటే.. పూర్తి వివరాలు

|

Oct 31, 2022 | 8:51 PM

అత్యవసరమైన సందర్భాల్లో, పండుగ సీజన్లలో చాలా మంది పర్సనల్ లోన్స్‌ తీసుకుంటుంటారు. ఇంకా.. చాలా మంది వ్యాపారాన్ని నడిపేందుకు వ్యక్తిగత రుణం తీసుకుంటారు. ముందుగా స్నేహితుల దగ్గరో లేక బంధువుల దగ్గరో అప్పు చేసి ఇన్వెస్ట్ చేస్తారు.

Personal Loan: పర్సనల్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారా..? ఏ బ్యాంకులో వడ్డీ రేటు తక్కువగా ఉందంటే.. పూర్తి వివరాలు
Bank Interest Rate
Follow us on

అత్యవసరమైన సందర్భాల్లో, పండుగ సీజన్లలో చాలా మంది పర్సనల్ లోన్స్‌ తీసుకుంటుంటారు. ఇంకా.. చాలా మంది వ్యాపారాన్ని నడిపేందుకు వ్యక్తిగత రుణం తీసుకుంటారు. ముందుగా స్నేహితుల దగ్గరో లేక బంధువుల దగ్గరో అప్పు చేసి ఇన్వెస్ట్ చేస్తారు. సమయానికి ఇవ్వకపోతే.. వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సందర్భంలో చాలామంది బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటారు. బ్యాంకులు ఎటువంటి పత్రాలను తాకట్టుపెట్టుకోకుండా, వేగంగా వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ కు అనుగుణంగా రుణం ఇస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చౌకైన వ్యక్తిగత రుణం గురించి మీకు తగినంత సమాచారం కావాలన్నా.. లేక అతితక్కువ వడ్డీ కోసం ఏ బ్యాంకు మంచిది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకుంటే, మీ క్రెడిట్ స్కోర్‌ను బాగా ఉంచుకోవాలి. మంచి క్రెడిట్ స్కోర్ రుణాన్ని త్వరగా.. ఎక్కుగా వచ్చేలా చేస్తుంది. దీని సహాయంతో మీరు వెంటనే లోన్ పొందవచ్చు. దేశంలో అనేక బ్యాంకులుచ, ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తి త్వరగా పర్సనల్ లోన్ పొందవచ్చు. అలాగే, ఎలాంటి ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి మీరు సకాలంలో రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నప్పుడు ఎంత ఫండ్ అవసరం అవుతుంది అనే ముందు.. మీ టార్గెట్ తెలుసుకోవాలి. మీకు ఎంత ఫండ్ కావాలి? మీ నెలవారీ ఆదాయం ఆధారంగా మీరు ఎంత సమయం లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించగలరో అంచనా వేసుకోవాలి. పర్సనల్ లోన్ మొత్తం వడ్డీ రేటు, లోన్ మొత్తం ఆధారంగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డికే రుణాలు..

మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, మీరు తక్కువ వడ్డీ రేటుతో రుణం కోసం ఆర్థిక సంస్థ లేదా బ్యాంకును సంప్రదించవచ్చు. రుణంపై తక్కువ వడ్డీని చెల్లించడానికి, రుణగ్రహీత తక్కువ వ్యవధితో రుణం కోసం దరఖాస్తు చేయాలి. ఈ జాబితాలో రుణ ఆఫర్లు, వడ్డీ రేటు, బ్యాంకుల EMI పోలిక ఆధారంగా దీనిని చెబుతున్నాం. ఈ జాబితాలో మేము రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను 3 సంవత్సరాల కాలవ్యవధితో పోల్చి వివరాలను అందిస్తున్నాం. మీ అవసరాన్ని బట్టి ఏది మంచిదో నిర్ణయించుకోవచ్చు. దీని కోసం కింద ఇచ్చిన పట్టికను చూడండి..

Personal Loan Interest Rate

గమనిక.. మరిన్ని వివరాల కోసం.. బ్యాంకులను సంప్రదించండి..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..