LPG Booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్.. ఆ యాప్ ఏంటంటే..?

|

Jun 27, 2024 | 3:37 PM

ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర సామాన్యులను షాక్‌కు గురి చేస్తుంది. గతంలో గ్యాస్ సిలిండర్ అయిపోయాక బుక్ చేసుకోవడం అనేది పెద్ద ప్రహసనంగా ఉండేది. గ్యాస్ సిలిండర్ అయిపోయాక సంబంధిత డీలర్ ఆఫీస్‌కు వెళ్లి లైన్‌లో నుంచొని బుక్ చేశాక ఓ పది రోజులకు గానీ గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చే కాదు. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా ఇటీవల కాలంలో సిలిండర్ బుకింగ్ చాలా సింపుల్ అయిపోయింది. సింపుల్‌గా మన స్మార్ట్ ఫోన్ నుంచి గ్యాస్ బుక్ చేసుకుంటే రెండు రోజుల్లోనే సిలిండర్ ఇంటికి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలా యాప్స్ సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

LPG Booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్.. ఆ యాప్ ఏంటంటే..?
Save Cooking Gas
Follow us on

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడకం అనేది సర్వసాధారణ విషయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ కనెక్షన్‌లను సబ్సిడీపై అందించడంతో దేశంలో గ్యాస్ వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర సామాన్యులను షాక్‌కు గురి చేస్తుంది. గతంలో గ్యాస్ సిలిండర్ అయిపోయాక బుక్ చేసుకోవడం అనేది పెద్ద ప్రహసనంగా ఉండేది. గ్యాస్ సిలిండర్ అయిపోయాక సంబంధిత డీలర్ ఆఫీస్‌కు వెళ్లి లైన్‌లో నుంచొని బుక్ చేశాక ఓ పది రోజులకు గానీ గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చే కాదు. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా ఇటీవల కాలంలో సిలిండర్ బుకింగ్ చాలా సింపుల్ అయిపోయింది. సింపుల్‌గా మన స్మార్ట్ ఫోన్ నుంచి గ్యాస్ బుక్ చేసుకుంటే రెండు రోజుల్లోనే సిలిండర్ ఇంటికి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలా యాప్స్ సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని కొన్ని యాప్స్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి క్యాష్ బ్యాక్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంత మేర క్యాష్ బ్యాక్ అందిస్తుందో? ఓ సారి తెలుసుకుందాం. 

డిజిటల్ చెల్లింపు సదుపాయాన్ని అందించే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఎల్‌పీజీ సిలిండర్‌లను బుక్ చేసుకుంటే వినియోగదారులు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందడానికి కస్టమర్‌లు ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా గ్యాస్ బుకింగ్‌ల కోసం చెల్లింపు చేయాలి. ప్రస్తుతం, ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 803గా ఉంది. అయితే మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఎల్‌పిజి సిలిండర్‌ను బుక్ చేసి ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే మీకు 10 శాతం (రూ. 80) క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ విధంగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మీకు రూ.723 అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా గ్యాస్ బుకింగ్ ఇలా

  • మీరు మీ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ని తెరవాలి.
  • దీని తర్వాత మీరు హోమ్ పేజీలో కింద కనిపించే పే చిహ్నంపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు రీఛార్జ్ & చెల్లింపు బిల్లుల విభాగంలో బుక్ సిలిండర్‌పై క్లిక్ చేయాలి.
  • దీని తర్వాత సెలెక్ట్ ఆపరేటర్‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీరు సెలెక్ట్ ఐడిని ఎంచుకోవాలి. వినియోగదారు నంబర్ లేదా మొబైల్ నంబర్ లేదా ప్రత్యేక కస్టమర్ ఐడీని నమోదు చేయాలి.
  • అనంతరం ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీరు మీ బుకింగ్ మొత్తాన్ని చూస్తారు.
  • తర్వాత పే నౌపై క్లిక్ చేయాలి. ఇప్పుడు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందడానికి ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాలి. ఈ క్యాష్‌బ్యాక్ మీ ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..