AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insta Help: మీకు పని మనుషులు కావాలా నాయనా? 10 నిమిషాల్లో మీ ఇంటికి.. ఈ యాప్స్‌తో మీ పనులన్నీ చిటికెలో..

Insta Help: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ముఖ్యంగా ఉద్యోగస్తులకు సమయం చాలా విలువైంది. వారికి తక్కువ ధరలో, వేగంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు అందించే ఈ 'డిజిటల్ సేవకులు' ఇప్పుడు లగ్జరీ కాదు.. ఒక అవసరంగా మారిపోయారు. అలాగే..

Insta Help: మీకు పని మనుషులు కావాలా నాయనా? 10 నిమిషాల్లో మీ ఇంటికి.. ఈ యాప్స్‌తో మీ పనులన్నీ చిటికెలో..
Insta Help
Subhash Goud
|

Updated on: Apr 28, 2026 | 7:41 AM

Share

Insta Help: కాలం మారింది..! ఒకప్పుడు ప్లంబర్ రావాలన్నా, ఇల్లు శుభ్రం చేసే మనిషి దొరకాలన్నా గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రి ఇంటికి వస్తున్నట్టే, ‘ఇంటి సాయం’ (Home Help) కూడా మీ గుమ్మం వద్దకు వచ్చేస్తోంది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పుడు ’10 నిమిషాల గృహ సేవలు’ ట్రెండింగ్‌గా మారాయి.

కోటి దాటిన వినియోగదారులు:

మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో తక్షణ గృహ సేవల యాప్స్ వాడుతున్న వారి సంఖ్య 1 కోటి (10 మిలియన్లు) దాటింది. ఇల్లు శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం, బట్టలు ఇస్త్రీ చేయడం, తోటమాలి లేదా డ్రైవర్ కావాలనుకోవడం.. ఇలా ఏ అవసరానికైనా పట్టణ భారతీయులు ఇప్పుడు యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.

మార్కెట్‌లో పోటీ: అర్బన్ కంపెనీ వర్సెస్ స్టార్టప్స్

ప్రస్తుతం ఈ రంగంలో అర్బన్ కంపెనీ (Urban Company) 6.5 మిలియన్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, దీనికి పోటీగా ప్రాంటో (Pronto), స్నాబిట్ (Snabit) వంటి స్టార్టప్‌లు వేగంగా దూసుకువస్తున్నాయి. మార్చి నెలలో జరిగిన యాప్ డౌన్‌లోడ్స్‌లో ప్రాంటో 43% వాటాతో టాప్‌లో నిలవగా, అర్బన్ కంపెనీ 31%, స్నాబిట్ 26% వాటాను దక్కించుకున్నాయి.

ఇవి కూడా చదవండి

నిజంగా 10 నిమిషాల్లో వస్తున్నారా?

డేటా ప్రకారం.. ఇది సాధ్యమవుతోందనే తెలుస్తోంది. అర్బన్ కంపెనీ ప్రవేశపెట్టిన ‘ఇన్‌స్టాహెల్ప్’ (InstaHelp) సేవలు నెలకు 10 లక్షల బుకింగ్‌లను దాటేశాయి. ప్రాంటో రోజుకు 18,000 బుకింగ్‌లతో (నెలకు సుమారు 5 లక్షలు) దూసుకుపోతోంది. స్నాబిట్ కూడా త్వరలోనే నెలకు 10 లక్షల మార్కును అందుకోవడానికి సిద్ధంగా ఉంది.

పెట్టుబడుల వెల్లువ:

ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను చూసి వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నారు. ప్రాంటో సంస్థ సుమారు $200 మిలియన్ల విలువను చేరుకోబోతుండగా, స్నాబిట్ తన విలువను $400 మిలియన్ల వరకు పెంచుకునే దిశగా భారీ నిధులను సమీకరిస్తోంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ముఖ్యంగా ఉద్యోగస్తులకు సమయం చాలా విలువైంది. వారికి తక్కువ ధరలో, వేగంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు అందించే ఈ ‘డిజిటల్ సేవకులు’ ఇప్పుడు లగ్జరీ కాదు.. ఒక అవసరంగా మారిపోయారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!

ఇది కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో కేవలం రూ.1 లక్ష డిపాజిట్‌ చాలు రూ.42,524 వడ్డీ.. అద్భుతమైన స్కీమ్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us