Budget 2023: అన్ని వర్గాలకు వరం.. తెలుగింటి కోడలు నిర్మలమ్మ తీసుకొచ్చిన ‘శ్రీ అన్న’ పథకం.. ఎవరికి ఎంత లాభమో తెలుసా..

|

Feb 02, 2023 | 7:45 AM

ఇటువంటి ధాన్యాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తృణధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌2023లో పలు పథకాలను ప్రారంభించింది కేంద్రం.

Budget 2023: అన్ని వర్గాలకు వరం.. తెలుగింటి కోడలు నిర్మలమ్మ తీసుకొచ్చిన శ్రీ అన్న పథకం.. ఎవరికి ఎంత లాభమో తెలుసా..
Shri Anna
Follow us on

కొత్త పథకాలతో అన్ని వర్గాల వారిని టచ్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2023-24 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యంగా వ్యవసాయం, రైతుల కోసం అనేక పథకాలను ప్రస్తావించారు. అందులో దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్శించిన పథకం ‘శ్రీ అన్న’ స్కీం. ఈ పథకంపై అందరి దృష్టి ప్రత్యేకంగా పడింది. దేశంలో ముతక ధాన్యాల( మిల్లెట్స్) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు శ్రీ అన్న యోజనను ప్రారంభించినట్లు తెలిపారు. మిల్లెట్స్ అంటే చిరు ధాన్యలకు శ్రీ అన్న అనే పదాన్ని ఉపయోగించారు. అంటే, ఈ పథకం కింద, ముతక ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు జరుగుతాయి. ఇందుకోసం ఇండియన్‌ మిల్లెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. శ్రీ అన్న యోజన కింద ముతక ధాన్యాల ఉత్పత్తికి రైతులను ప్రోత్సహిస్తారు.

‘శ్రీ అన్న’ అంటే ఏంటి?

ఇక్కడ ముతక ధాన్యాలు(చిరు ధాన్యలు) అంటే మిల్లెట్‌లను శ్రీ అన్న అని పిలుస్తారు. ఇటువంటి ధాన్యాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రపంచంలోనే మినుములను ఎగుమతి చేసే దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి సభకు తెలిపారు. జోన్నలు, రాగి, సజ్జలు, కుట్టు, రామదానా, కంగ్నీ, కుట్కి, కోడో, చిన, సామ వంటి అనేక తృణధాన్యాలు భారతదేశంలో ఉత్పత్తి చేయబడతాయి.

  • జొన్నలు (Sorghum)
  • సజ్జలు (Pearl millet)
  • కొఱ్ఱలు (Foxtail millet)
  • వరిగెలు (Proso millet)
  • రాగులు (Finger millet)
  • కులై
  • కుసుములు
  • అరికెలు (Kodo millet)
  • అండు కొర్రలు
  • సామలు (Little millet)
  • ఊదలు (Indian barnyard millet)

ఈ ముతక ధాన్యాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా శ్రీ అన్నగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అంతర్జాతీయ స్థాయిలో మినుములకు సంబంధించిన పరిశోధన సాంకేతికతను, దాని మెరుగైన ఉత్పత్తి పద్ధతులను అందిస్తోంది. అందువల్ల, ఈ సంస్థ ఈ రంగంలో భారీ సహకారం అందించింది.

శ్రీ అన్న ఎందుకు ప్రత్యేకం?

ఆహార భద్రతతో పాటు అంతర్జాతీయ సంబంధాలకు మిల్లెట్ పంట చాలా ముఖ్యమైనది. ఇటీవల, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా కరోనా మహమ్మారి, వాతావరణ మార్పు, ఇతర సవాళ్ల మధ్య మిల్లెట్ల  ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ఆసియా, ఆఫ్రికా మిల్లెట్స్ ప్రధాన ఉత్పత్తి, వినియోగదారు దేశాలలో ఒకటి. భారతదేశంతో పాటు, నైజర్, సూడాన్, నైజీరియా కూడా మిల్లెట్‌ల ప్రధాన ఉత్పత్తిదారులు.

మిల్లెట్ పంటల ప్రత్యేకత ఏంటి?

శ్రీ అన్న పంటలకు తక్కువ నీరు అవసరం. ఉదాహరణకు, చెరకు మొక్కకు 2100 మి.మీ నీరు అవసరం. అదే సమయంలో ఒక మిల్లెట్ పంటకు దాని మొత్తం జీవితకాలంలో 350 మిమీ నీరు మాత్రమే అవసరం. నీటి కొరత కారణంగా ఇతర పంటలు నాశనమవుతాయి. మరోవైపు, ముతక ధాన్యాల పంట పాడైతే.. దానిని జంతువులకు మేతగా ఉపయోగించవచ్చు.

భారతదేశంలో సజ్జలు 41 శాతం ఉత్పత్తి

సజ్జలు ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం దాదాపు 41 శాతం వాటాను కలిగి ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం, 2020 సంవత్సరంలో 30.464 మిలియన్ మెట్రిక్ టన్నుల మిల్లెట్ ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం మాత్రమే 12.49 మిలియన్ మెట్రిక్ టన్నులను కలిగి ఉంది. గతేడాది కూడా మిల్లెట్ ఉత్పత్తిలో భారత్ 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారతదేశంలో రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రధాన మిల్లెట్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. అంచనాల ప్రకారం, 2025 నాటికి, మిల్లెట్ ఉత్పత్తి మార్కెట్ విలువ $ 9 బిలియన్ నుంచి $(డాలర్లు) 12 బిలియన్లకు పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం