Budget 2022 Time: వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget-2022) కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ కోసం పార్లమెంట్ సమావేశాలు ఈరోజు (జనవరి 31) ప్రారంభం అయ్యాయి. ఇక ఫిబ్రవరి 1న బడ్జెట్ ను దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టనున్నారు. వరుసగా నాలుగోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే , కోవిడ్ మహమ్మారి మూడవ వేవ్ దృష్ట్యా, కోవిడ్ సంబంధిత సామాజిక దూరం నియమాలను పాటించేలా చూసేందుకు లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు రోజులో వేర్వేరు సమయాల్లో నిర్వహించబడతాయి. బడ్జెట్ సెషన్ ఏప్రిల్8న ముగుస్తుంది. సెషన్ మొదటి భాగం ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతోంది. అయితే బడ్జె్‌ట్ సందర్భంగా వివిధ ఛానెళ్లలో లైవ్ కొనసాగనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని లైవ్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడాలి అనే విషయాలను మీకు తెలియజేస్తున్నాము. బడ్జెట్ 2022 ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటలకు మంత్రి ప్రవేశపెడతారు. ఈ లైవ్‌ను ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం టీవీ9 తెలుగులో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ లింక్ లైవ్ ద్వారా వీక్షించండి వీటితో పాటు లోక్ సభ టీవీ, దూరదర్శన్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో చూడవచ్చు.
ఇవి కూడా చదవండి: