రేపటి నుంచి మళ్ళీ రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల వేళ ..సీనియర్ల గైర్ హాజర్ ?

రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2021-22 సంవత్సరానికి సంబంధించి వివిధ గ్రాంట్లు, పద్దులను, ద్రవ్య వినిమయ బిల్లును  సభ ఆమోదించే విషయంపై  ప్రభుత్వం ప్రధానంగా దృష్టి నిలిపింది.

రేపటి నుంచి మళ్ళీ రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల వేళ ..సీనియర్ల గైర్ హాజర్  ?
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 07, 2021 | 5:24 PM

రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2021-22 సంవత్సరానికి సంబంధించి వివిధ గ్రాంట్లు, పద్దులను, ద్రవ్య వినిమయ బిల్లును  సభ ఆమోదించే విషయంపై  ప్రభుత్వం ప్రధానంగా దృష్టి నిలిపింది. అయితే అయిదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశాలకు గైర్ హాజరు కావచ్చునని భావిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 22 వరకు ద్రవ్య వినిమయ బిల్లుపై సభ చర్చిస్తుంది. ఇక పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్ మెంట్ బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లు, క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు వంటి పలు బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది.

ఫిబ్రవరి 1 న ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంటుకు సమర్పించింది. బడ్జెట్ పై సుదీర్ఘంగా సభ చర్చించింది. అలాగే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కూడా రెండు రోజులపాటు సభ్యులు చర్చించారు. గతనెల 15 న రాజ్యసభలో  ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సభ్యత్వం ముగిసిన సందర్భంగా అంతకుముందు సభలో ప్రసంగించిన  ప్రధాని మోదీ..ఒకప్పుడు ఆయనకు, తనకు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ కంట తడి పెట్టారు. గతంలో  తాను గుజరాత్ సీఎం గాను,  ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగాను ఉన్నప్పుడు కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని అయన ప్రధానంగా ప్రస్తావించారు.  నాటి సభలో వీరి  గత స్నేహమే హైలైట్ అయింది. ఇక రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8 న ముగియనున్నాయి. తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీనియర్లంతా ప్రచారానికి వెళ్తారు గనుక ఈ రెండో విడత బడ్జెట్ సెషన్ చప్పగా జరగవచ్చునని భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

హోంమంత్రి మహమూద్ అలీ‌ మనవడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. ఆయన స్పందన ఎంటంటే..?

Minister Perni Nani: చంద్రబాబు ఆ ట్రాన్స్ నుంచి బయటకు రావాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని..