Budget-2024: మధ్యంతర బడ్జెట్ ద్వారా ఈ 10 ఆశలు నెరవేరుతాయా?

మోడీ ప్రభుత్వానికి ఇది మధ్యంతర బడ్జెట్‌. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో కేవలం ప్రజలు పన్ను రాయితీలతో పాటు వివిధ తగ్గింపుల ప్రకటనల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలకు సబ్సిడీల కోసం ఆత్రుతగా బడ్జెట్‌ను ఫాలో అవుతూ..

Budget-2024: మధ్యంతర బడ్జెట్ ద్వారా ఈ 10 ఆశలు నెరవేరుతాయా?
Budget 2024

Updated on: Feb 01, 2024 | 10:29 AM

Budget-2024: కేంద్ర ప్రభుత్వం ఈరోజు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది మోడీ ప్రభుత్వానికి మధ్యంతర బడ్జెట్‌. మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఈ బడ్జెట్‌పై సామాన్యులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ ప్రత్యేక సమస్యలేంటో తెలుసుకుందాం.

  1. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి: కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం పెంచుతుందని రైతులు ప్రభుత్వం నుండి ఆశించారు.
  2. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం షరతులను సడలించవచ్చు.
  3. ఆయుష్మాన్ భారత్ యోజన: ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన పరిధి పెరగవచ్చు, ఎక్కువ మందిని చేర్చుకోవచ్చు
  4. పన్ను మినహాయింపు: కొత్త పన్ను విధానంలో, పన్ను మినహాయింపు పెరగవచ్చు లేదా గరిష్ట పన్ను స్లాబ్‌ను తగ్గించవచ్చు.
  5. ఆరోగ్య బీమా: ఆరోగ్య బీమాలో పారదర్శకత కోసం కొత్త రెగ్యులేటర్‌ను ప్రకటించవచ్చు, దీనితో పాటు ప్రతి బీమా కంపెనీ అన్ని రకాల బీమాలను విక్రయించే స్వేచ్ఛను పొందవచ్చు.
  6. గిగ్ వర్కర్స్: గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకురావచ్చు. వారిని ESIC పరిధిలో చేర్చవచ్చు
  7. ప్రధానమంత్రి ఆవాస్ యోజన: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే మొత్తంలో పెరుగుదల ఉండవచ్చు.
  8. కొత్త పెన్షన్ స్కీమ్: కొత్త పెన్షన్ స్కీమ్ కింద గ్యారెంటీ పెన్షన్ సదుపాయాన్ని ప్రకటించవచ్చు.
  9. సౌర వ్యవస్థ: సౌర శక్తిని ప్రోత్సహించడానికి, 1 కోటి ఇళ్లలో సౌర వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బడ్జెట్‌ను ప్రకటించవచ్చు.
  10. వందే భారత్ రైలు: కొత్త వందే భారత్ రైళ్లను ప్రకటించవచ్చు, రైల్వే బడ్జెట్ పెరగవచ్చు.

మరిన్ని బడ్జెట్‌కు సంబంధించి లైవ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి