Budget 2022: ఐటీ రిటర్న్‌ల దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. బడ్జెట్‌లో వారికి నిరాశ

|

Feb 01, 2022 | 1:55 PM

Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు . మోదీ ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ను..

Budget 2022: ఐటీ రిటర్న్‌ల దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. బడ్జెట్‌లో వారికి నిరాశ
Follow us on

Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు . మోదీ ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ను కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలో సమర్పించారు. అందువల్ల, దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆర్థిక మంత్రి సీతారామన్‌కి ఇది నాలుగో బడ్జెట్‌.

ఐటీ రిటర్న్‌ల దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌:

ఐటీ రిటర్న్‌ల దాఖలు చేసేవారికి కేంద్ర సర్కార్‌ గుడ్‌న్యూస్‌ తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్‌డేట్‌ చేసుకునే వెలుసుబాటు కల్పించారు. రిటర్న్‌లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణ చేసుకోవచ్చు. ఇక కోటి కుటుంబాలకు ఉజ్వల పథకం విర్తించనున్నట్లు తెలిపారు. సహకార సంఘాలపై సర్‌ఛార్జీని తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటించారు.

రాష్ట్ర ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ డిడక్షన్‌:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (NPS) డిడక్షన్‌ ఉంటుందని మంత్రి వివరించారు. ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఆదాయపు పన్ను మినహాయింపుపై నిరాశ:

ఇక ఆదాయపు పన్ను మినహాయింపుపై ఈ సారి నిరాశ కలిగించింది. వేతన జీవులకు ఊరట కల్పించే ఏ నిర్ణయాన్ని మంత్రి ఈ బడ్జెట్‌లో ప్రకటించకపోవడంతో కొంత నిరాశ వ్యక్తం అవుతోంది. ఆదాయపు పన్ను మినహాయింపులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు నిరాశే పెరిగింది.

ఇవి కూడా చదవండి:

Budget 2022: బంపర్‌ ఆఫర్స్‌.. నిర్మలమ్మ బడ్జెట్‌లో తగ్గినవి ఇవే.. చౌకగా మొబైల్ ఫోన్స్

Budget 2022: పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఇవే..

Budget 2022: క్రిప్టో కరెన్సీకి ఎదురు దెబ్బ..30 శాతం పన్ను విధింపు.. బడ్జెట్‌ సమావేశంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి

Budget 2022: యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో బడ్జెట్‌ ప్రతులు.. డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా..?