ఈ సంక్షోభాన్ని రాజకీయం చేయొద్దు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ హితవు

| Edited By: Anil kumar poka

Apr 09, 2020 | 12:25 PM

గ్లోబల్ హెల్త్ క్రైసిస్ (కరోనా మహమ్మారి) ని రాజకీయం చేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ గెబ్రోసిస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోరారు. ఈ క్లిష్ఠ  సమయంలో ఐక్యత అవసరమని, ముఖ్యంగా చైనా, అమెరికా 'నిజాయితీ గల నాయకత్వం' చూపాలని ఆయన అన్నారు.

ఈ సంక్షోభాన్ని రాజకీయం చేయొద్దు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ హితవు
Follow us on

గ్లోబల్ హెల్త్ క్రైసిస్ (కరోనా మహమ్మారి) ని రాజకీయం చేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ గెబ్రోసిస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోరారు. ఈ క్లిష్ఠ  సమయంలో ఐక్యత అవసరమని, ముఖ్యంగా చైనా, అమెరికా ‘నిజాయితీ గల నాయకత్వం’ చూపాలని ఆయన అన్నారు. గెబ్రోసిస్ చైనా పట్ల పక్షపాతం చూపుతున్నారని, తాము ఈ సంస్థకు నిధులను ఆపివేస్తామని ట్రంప్ హెచ్ఛరించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ఆరోపణలను ఆయన ఖండిస్తూ.. తాము ఎవరిపట్లా పక్షపాతం చూపడంలేదన్నారు. మా సంస్థకు మీరు ఆర్ధిక సాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నా అన్నారు. కరోనా అదుపునకు ఆయా దేశాలు చేస్తున్నకృషిని తాను ప్రస్తావించానే తప్ప.. ఆ దేశంపట్ల తమకు ప్రత్యేక అభిమానం లేదని స్పష్టం చేశారు.  గత ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా 400 మిలియన్ డాలర్లకు పైగా ఆర్ధిక సాయాన్ని అందజేసింది. మాతో పోలిస్తే చైనా మీకు అందిస్తున్న సాయం చాల తక్కువ అన్నారు. ఈ విషయాన్ని గెబ్రోసిస్ గమనించాలని ట్రంప్ కోరారు. జనవరి 14 న గెబ్రోసిస్ తనను విమర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అవసరమైతే చైనా విమానాలను మా దేశంలోకి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.