AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతిపెద్ద గండం నుంచి బయటపడ్డ పాక్.. కరోనాకు థ్యాంక్స్ చెప్పుకుంటుందేమో..!

ప్రపంచ దేశాలన్నింటికి కన్నీరు తెప్పిస్తున్న కరోనా.. పాకిస్థాన్‌కు మాత్రం ఓ శుభవార్తను చెప్పింది. ఈ వైరస్‌ ప్రభావంతో.. పాకిస్థాన్ అతిపెద్ద గండం నుంచి బయటపడినట్లే అయ్యింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా.. చేపట్టే నిరోధక చర్యలపై ఈ జూన్‌లో ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో ఈ సమావేశం వాయిదా పడినట్లు సమాచారం. దీంతో పాక్ ప్రభుత్వం ఊపిరి తీసుకుంటున్నట్లు ఉంది. ఎందుకంటే.. ఈ సారి జరిగే సమావేశాల్లో […]

అతిపెద్ద గండం నుంచి బయటపడ్డ పాక్.. కరోనాకు థ్యాంక్స్ చెప్పుకుంటుందేమో..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 08, 2020 | 8:14 PM

Share

ప్రపంచ దేశాలన్నింటికి కన్నీరు తెప్పిస్తున్న కరోనా.. పాకిస్థాన్‌కు మాత్రం ఓ శుభవార్తను చెప్పింది. ఈ వైరస్‌ ప్రభావంతో.. పాకిస్థాన్ అతిపెద్ద గండం నుంచి బయటపడినట్లే అయ్యింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా.. చేపట్టే నిరోధక చర్యలపై ఈ జూన్‌లో ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో ఈ సమావేశం వాయిదా పడినట్లు సమాచారం. దీంతో పాక్ ప్రభుత్వం ఊపిరి తీసుకుంటున్నట్లు ఉంది. ఎందుకంటే.. ఈ సారి జరిగే సమావేశాల్లో పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జూన్‌లో జరిగే ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ సమావేశాలు చైనాలో జరగాల్సి ఉంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ బ్లాక్‌ లిస్టులో పడిపోయేది. గతంలో చైనా వెననకేసుకు రావడంతో.. గ్రే లిస్టులో పెట్టింది (ఎఫ్‌ఏటీఎఫ్).

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా గతంలో ఎఫ్‌ఏటీఎఫ్ సూచించిన ప్రణాళికను పాక్ ఏమేరకు అమలు చేసిందన్న దానిపై రివ్యూ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన సభ్యదేశాలు ఆశించిన పనితీరును పాక్ కనబర్చినట్లు కనిపించకపోతే.. ఇక పాకిస్థాన్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలు కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడుతుండటంతో.. పాక్‌కు తాత్కాలిక ఊరట లభించినట్లైంది.

Follow Us
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా
కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? సూపర్ టిప్స్..
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? సూపర్ టిప్స్..
ప్రేమంటే ఇదేరా..? టర్కీ కోడి చనిపోతే.. తల్లడిల్లిన మరో కోడి..
ప్రేమంటే ఇదేరా..? టర్కీ కోడి చనిపోతే.. తల్లడిల్లిన మరో కోడి..
ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టాడు..
ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టాడు..
యుద్ధం ఉద్రిక్తతల మధ్య భారత రక్షణశాఖ సంచలన నిర్ణయం!
యుద్ధం ఉద్రిక్తతల మధ్య భారత రక్షణశాఖ సంచలన నిర్ణయం!
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..