భారత దాడిపై పాక్ ఏమంటోంది?

|

Feb 26, 2019 | 10:09 AM

న్యూఢిల్లీ: దెబ్బకు దెబ్బ పడింది. పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. అయితే ఈ దాడి నేపధ్యంలో పాకిస్థాన్ మాత్రం బోంకుతోంది. భారత విమానాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశిస్తే విజయవంతంగా తిప్పి కొట్టామని చెబుతోంది. అంతేకాదు భారత్ విమానాల ద్వారా బాంబులు వేసిన ప్రదేశం ఖాళీగా ఉన్న ప్రదేశం అని, నిర్మాణాలు కూడా […]

భారత దాడిపై పాక్ ఏమంటోంది?
Follow us on

న్యూఢిల్లీ: దెబ్బకు దెబ్బ పడింది. పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. అయితే ఈ దాడి నేపధ్యంలో పాకిస్థాన్ మాత్రం బోంకుతోంది. భారత విమానాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశిస్తే విజయవంతంగా తిప్పి కొట్టామని చెబుతోంది.

అంతేకాదు భారత్ విమానాల ద్వారా బాంబులు వేసిన ప్రదేశం ఖాళీగా ఉన్న ప్రదేశం అని, నిర్మాణాలు కూడా అక్కడ లేవని, ఎలాంటి నష్టం జరగలేదని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి అయిన మేజర్ జనరల్ అసిఫ్ ప్రకటించాడు. అయితే ఇతరత్రా సంకేతిక అంశాలకు సంబంధించిన సమాచారం మాత్రం తెలియాల్సి ఉందని చెప్పాడు.