షాకింగ్ న్యూస్: యూపీ జైల్లో 120 మంది ఖైదీల‌కు కోవిడ్‌..

| Edited By:

Jul 24, 2020 | 8:40 AM

భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. ఇప్ప‌టికే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తూనే..

షాకింగ్ న్యూస్: యూపీ జైల్లో 120 మంది ఖైదీల‌కు కోవిడ్‌..
Follow us on

భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. ఇప్ప‌టికే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తూనే ఉంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 ల‌క్ష‌లు దాటిపోయింది. ఇక ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, వైద్యులు, పోలీసులు, ప్ర‌ముఖ న‌టులు కూడా ఈ వైర‌స్ బారిన ప‌డుతూనే ఉంటున్నారు. సామాన్యుల‌తో పాటు వారికి కూడా క‌రోనా వ‌స్తూండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎటు నుంచి ఎలా ఈ కోవిడ్ మ‌హ‌మ్మారి ఎటాక్ చేస్తుందోన‌ని భ‌యాందోళ‌న చెందుతున్నారు.

కాగా ప్ర‌స్తుతం జైళ్ల‌లో ఉంటోన్న ఖైదీలు సైతం ఈ క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఝాన్సీ జైల్లో ఉంటోన్న 120 మంది ఖైదీలకు కోవిడ్ నిర్థార‌ణ అయింది. దీంతో అప్ర‌మ‌త్తమై జైళ్ల శాఖ వెంట‌నే వారిని అక్క‌డి నుంచి త‌ర‌లించి ప్ర‌త్యేకంగా క్వారంటైన్‌లో ఉంచింది. అలాగే వీరితో ఎవ‌రెవ‌రు కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా టెస్టులు నిర్వ‌హిస్తోంది యూపీ ప్ర‌భుత్వం. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న క‌రోనా కేసుల లిస్టులో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఆరో స్థానంలో ఉంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ 55,588 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌గా, 1263 మంది మ‌ర‌ణించారు.

Read More:

మ‌హారాష్ట్ర, జ‌మ్మూక‌శ్మీర్‌లో భూ ప్ర‌కంప‌న‌లు..

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్‌.. ఉధృతంగా కేసులు న‌మోదు..

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా టెర్ర‌ర్‌.. విప‌రీతంగా పెరిగిపోతున్న కేసులు..