తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా టెర్ర‌ర్‌.. విప‌రీతంగా పెరిగిపోతున్న కేసులు..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా టెర్ర‌ర్‌.. విప‌రీతంగా పెరిగిపోతున్న కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 7:19 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం కొత్త‌గా 7,998 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 72,711కి చేరింది. ఇందులో 34,272 యాక్టివ్ కేసులు ఉండగా.. 37,555 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 884కి చేరింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 5,428 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 61 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 1016, చిత్తూరు 271, ఈస్ట్ గోదావరి 1391, గుంటూరు 1184, కడప 224, కృష్ణ 230, కర్నూలు 904, నెల్లూరు 438, ప్రకాశం 271, శ్రీకాకుళం 360, విశాఖపట్నం 684, విజయనగరం 277, వెస్ట్ గోదావరిలో 748 కేసులు నమోదయ్యాయి. కాగా, నేటి వరకు 14,93,879 సాంపిల్స్ ని పరీక్షించారు.

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. నిత్యం పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గురువారం కొత్తగా 1,567 మందికి కరోనా సోకినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక ఇవాళ నిన్న‌ బారినపడి తొమ్మిది మృతి చెందారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 50,826కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్ప‌టివ‌ర‌కూ 447 మంది ప్రాణాలొదిలారు. తాజాగా గురువారం 1,661 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ఇప్పటివరకూ కోలుకుని 39,327 మంది డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 యాక్టివ్ కరోనా కేసులున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.