టీటీడీ ఆస్తుల‌పై ఈవో అనిల్ కుమార్ కీల‌క నిర్ణ‌యం..

టీటీడీ ఆస్తుల‌కు సంబంధించి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల‌పై ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో నెల‌కొంటున్న వివాదాల నేప‌థ్యంలో టీటీడీ నిర్ణ‌యం కీల‌కంగా మారింది. టీటీడీ ఆస్తుల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని..

టీటీడీ ఆస్తుల‌పై ఈవో అనిల్ కుమార్ కీల‌క నిర్ణ‌యం..
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 1:34 PM

టీటీడీ ఆస్తుల‌కు సంబంధించి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల‌పై ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో నెల‌కొంటున్న వివాదాల నేప‌థ్యంలో టీటీడీ నిర్ణ‌యం కీల‌కంగా మారింది. టీటీడీ ఆస్తుల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. వివాదాల‌కు తావు లేకుండా పూర్తిస్థాయి ప‌రిశీల‌న త‌ర్వాతే శ్వేత ప‌త్రం విడుద‌ల చేస్తామ‌ని ఈవో అనిల్ సింఘాల్ స్ప‌ష్టం చేశారు. ఇక తొలిసారిగా తిరుప‌తిలోని టీటీడీ అడ్మినిస్ట్రేష‌న్ భ‌వ‌నంలో ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో’ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు అప్ప‌టి ప‌రిస్థితుల మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. ఉత్స‌వాల ఏర్పాట్ల‌కు టెండ‌ర్లు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పిన ఆయ‌న‌.. అప్ప‌టి ప‌రిస్థితులను బ‌ట్టి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై నిర్ణ‌యం తీసుకుంటామన్నారు. ఇక‌ టీటీడీకి ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బందులు ఏమీ లేవని తెలిపారు.

అలాగే తిరుమ‌ల‌లో 91 మంది టీటీడీ ఉద్యోగుల‌కు క‌రోనా వైర‌స్ సోకింద‌ని ఈవో అనిల్ కుమార్ తెలిపారు. తిరుమ‌ల‌కు వ‌చ్చి ప‌రీక్ష చేయించుకున్న ఏ ఒక్క భ‌క్తునికీ కోవిడ్ సోక‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. అలిపిరి వ‌ద్ద 1,704, తిరుమ‌ల‌లో 1,865 మంది టీటీడీ ఉద్యోగుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని.. మొత్తం 631 మంది యాత్రికులు క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని వెల్ల‌డించారు. లాక్ డౌన్ అనంత‌రం 82,563 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌ర్పించార‌ని, త‌ల‌నీలాల విలువ పెర‌గ‌డంతో రూ.7 కోట్ల ఆదాయం అద‌నంగా స‌మ‌కూరింద‌ని పేర్కొన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

Read More: 

క‌స్ట‌మ‌ర్ ఉదార‌త‌.. వెయిట‌ర్‌కి రూ.75 వేల టిప్

మోదీ సర్కార్ యాప్ ఛాలెంజ్.. రూ.15 లక్షలు గెలుచుకున్న ఏపీ విద్యార్థి..