కేంద్రానికి మనం ఇచ్చేదెంత.. మనకు వచ్చేదెంత.? : ఎంపీ రంజిత్ రెడ్డి

|

Sep 22, 2020 | 3:31 PM

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలపై బీజేపీ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఇస్తేనే కేంద్రం దగ్గర డబ్బులు ఉంటున్నాయని.. ఆ విషయం గుర్తుంచుకోవాలని రంజిత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 50 వేల కోట్లు ఇస్తే తిరిగి తెలంగాణకు ఇచ్చేది కేవలం రూ. 23 వేల కోట్లేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలకు […]

కేంద్రానికి మనం ఇచ్చేదెంత.. మనకు వచ్చేదెంత.? : ఎంపీ రంజిత్ రెడ్డి
Follow us on

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలపై బీజేపీ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఇస్తేనే కేంద్రం దగ్గర డబ్బులు ఉంటున్నాయని.. ఆ విషయం గుర్తుంచుకోవాలని రంజిత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 50 వేల కోట్లు ఇస్తే తిరిగి తెలంగాణకు ఇచ్చేది కేవలం రూ. 23 వేల కోట్లేనని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన చాలా ఆదాయాల్లో కేంద్రం కోత విధించిందన్న రంజిత్ రెడ్డి.. నిజామాబాద్‌లో రైతులను అడుగు.. ‘రైతు బంధు’ ఎవరు ఇస్తున్నారో చెప్తారంటూ అరవింద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోన నియంత్రణకు కేంద్రం కేవలం రూ. 290 కోట్లు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. మిగులు నిధులు ఇచ్చే రాష్ట్రాలలో తెలంగాణ ఒకటన్న ఆయన.. జీఎస్టీ, వెనుకబడిన జిల్లాల నిధులు రూ. 9 వేల కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందని.. బీజేపీ ఎంపీలు వాటిని తెలంగాణ ప్రజలకు ఇప్పించేందుకు కృషి చేయాలని రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు.