లోక్‌సభ ఎన్నికలకు శ్రీకారం

ఈ నెల 6న కరీంనగర్‍లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మైదానంలో జరుగుతున్న సమావేశ ఏర్పాట్లను ఎంపీ వినోద్‌కుమార్, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి పరిశీలించారు. అన్ని విధాలా కలిసి వచ్చిన కరీంనగర్ నుంచే లోక్‌సభ […]

లోక్‌సభ ఎన్నికలకు శ్రీకారం

Edited By:

Updated on: Mar 02, 2019 | 9:34 PM

ఈ నెల 6న కరీంనగర్‍లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మైదానంలో జరుగుతున్న సమావేశ ఏర్పాట్లను ఎంపీ వినోద్‌కుమార్, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి పరిశీలించారు.

అన్ని విధాలా కలిసి వచ్చిన కరీంనగర్ నుంచే లోక్‌సభ ఎన్నికలకు శ్రీకారం చుట్టాలన్న ఆలోచనతోనే ఇక్కడి నుంచి సన్నాహక సమావేశాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు మంత్రి ఈటల రాజేందర్. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందనీ, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి మూడు వేల చొప్పన కార్యకర్తలు, నాయకులు రానున్నారని తెలిపారు.