ఆ తర్వాతే విధుల్లోకి అభినందన్‌

హైదరాబాద్: ఆరోగ్యం కుదుటపడిన వెంటనే ఐఏఎఫ్ కంబాట్ పైలట్‌గా అభినందన్ బాధ్యతలు చేపడతారని భారత వాయుసేన చీఫ్‌ బీఎస్‌ ధనోవా తెలిపారు. పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో రెండో ఆలోచన లేదని, ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య నిపుణల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. పాక్‌కు యుద్ధ విమానం ఎఫ్‌-16‌ను భారత గగనతలంలోకి ప్రవేశించగా.. అభినందన్‌ వర్ధమాన్‌ ఆర్‌-73 అనే […]

ఆ తర్వాతే విధుల్లోకి అభినందన్‌

Updated on: Mar 04, 2019 | 5:33 PM

హైదరాబాద్: ఆరోగ్యం కుదుటపడిన వెంటనే ఐఏఎఫ్ కంబాట్ పైలట్‌గా అభినందన్ బాధ్యతలు చేపడతారని భారత వాయుసేన చీఫ్‌ బీఎస్‌ ధనోవా తెలిపారు. పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో రెండో ఆలోచన లేదని, ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య నిపుణల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.

పాక్‌కు యుద్ధ విమానం ఎఫ్‌-16‌ను భారత గగనతలంలోకి ప్రవేశించగా.. అభినందన్‌ వర్ధమాన్‌ ఆర్‌-73 అనే మిస్సైల్‌ ప్రయోగించి కూల్చేశారు. అదే సమయంలో అభినందన్‌ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగాల్సి వచ్చింది. దీంతో పాక్ ఆర్మీ చేతికి చిక్కి రెండు రోజుల తర్వాత భారత్‌కు తిరిగి వచ్చారు.