విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ వస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ జరిగే రైల్వే గ్రౌండ్ ను పరిశీలించారు కాన్నా. ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నికల వేళ మోడీ విశాఖ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీకి కేంద్రం సాయాన్ని వివరించేందుకు మోడీ విశాఖకు వస్తున్నారని అన్నారు కన్నా. మార్చి ఒకటో తేదీన జరిగే ఉత్తరాంధ్ర సభకు ప్రజలు హాజరై సక్సెస్ చేయాలన్నారు. రాష్ట్రానికి 50 కోట్ల రూపాయలిస్తే.. ఆ మొత్తాన్ని బాబు జన్మభూమి కమిటీలకు పంపారని విమర్శించారు.