ఎవరెవరికి ఏఏ శాఖ అంటే..!

హైదరబాద్: ఫలితాలు వచ్చి దాదాపు రెండున్నర నెలల తరువాత తెలంగాణ కేబినెట్ కొలువుదీరబోతోంది. ఈ ఉదయం 11.30గంటలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మొదటి విడుతలో పది మందిని ఎంపిక చేసిన కేసీఆర్.. వారందరికి శాఖలను ఖరారు చేశారు. వారిలో నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ, ప్రశాంత్ రెడ్డికి పరిశ్రమల శాఖ, కొప్పుల ఈశ్వర్‌కు విద్యా శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు‌కు వ్యవసాయ శాఖ, జగదీష్ రెడ్డికి రోడ్లు, భవనాలు, తలసానికి పౌర సరఫరాల శాఖ, ఇంద్రకరణ్‌రెడ్డికి […]

ఎవరెవరికి ఏఏ శాఖ అంటే..!

Edited By:

Updated on: Feb 19, 2019 | 10:38 AM

హైదరబాద్: ఫలితాలు వచ్చి దాదాపు రెండున్నర నెలల తరువాత తెలంగాణ కేబినెట్ కొలువుదీరబోతోంది. ఈ ఉదయం 11.30గంటలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మొదటి విడుతలో పది మందిని ఎంపిక చేసిన కేసీఆర్.. వారందరికి శాఖలను ఖరారు చేశారు.

వారిలో నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ, ప్రశాంత్ రెడ్డికి పరిశ్రమల శాఖ, కొప్పుల ఈశ్వర్‌కు విద్యా శాఖ
ఎర్రబెల్లి దయాకర్ రావు‌కు వ్యవసాయ శాఖ, జగదీష్ రెడ్డికి రోడ్లు, భవనాలు, తలసానికి పౌర సరఫరాల శాఖ, ఇంద్రకరణ్‌రెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖ, మల్లారెడ్డికి విద్యుత్ శాఖ, శ్రీనివాస్‌గౌడ్‌కు మున్సిపల్, ఎక్సైజ్ శాఖ, ఈటెలకు సంక్షేమ శాఖ కేటాయించారు. వీరందరి చేత ఇవాళ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వీరి ప్రమాణ స్వీకారంతో కలిపి మొత్తం కేబినెట్ సంఖ్య(కేసీఆర్‌తో కలిపి) 12కు పెరగనుంది. కాగా సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీకి హోంశాఖ దక్కిన విషయం తెలిసిందే.