ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిని ఫలితాల్లో వైసీపీ 152 స్థానాలు, టీడీపీ 23 స్థానాలు, జనసేన ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాగా ఈ ఫలితాల్లో ఏపీ మంత్రులు వెనుకబడ్డారు. నారా లోకేశ్, భూమా అఖిల ప్రియ, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, అమర్‌నాథ్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర వెనుకంజలో ఉన్నారు. మరోవైపు మంత్రులుగా పనిచేసిన దేవినేని, జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు ముందంజలో ఉన్నారు.