Tamilnadu government sensational decision: ఎందరి ప్రాణాలను బలిగొంటున్న ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఫళనిస్వామి కీలక ప్రకటన చేశారు. ఈ విషయంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న మధురై హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ల విషయంలో ముఖ్యమంత్రి ఫళని స్వామి స్పందించారు. క్రికెటర్లు, సినీ స్టార్లు ఆన్‌లైన్ గేమ్స్, రమ్మీ, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేయడాన్ని మధురై కోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రభుత్వ వైఖరి తెలియజేయాల్సిందిగా మధురై కోర్టు తమిళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
‘‘ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ కారణంగా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ రద్దు చేయాలని ఎంతో మంది పోరాడుతున్నారు.. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.. తొందరలోనే ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ రద్దు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము.. మధురై హైకోర్టులో ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు సంబంధించిన పిటిషన్ విచారణలో ఉంది.. ప్రభుత్వం తరపున త్వరలోనే బెట్టింగ్ గేమ్స్ రద్దు చేస్తామని కోర్టుకి విన్నవించాము..’’ అని ఫళని స్వామి ప్రకటన చేశారు.
ALSO READ: తలసాని 104 అంటే కేసీఆర్ 105 అన్నారు.. బల్దియా ఫలితంపై కేసీఆర్ జోస్యం
ALSO READ: హైదరాబాద్‌లో ఎలెక్షన్ కోడ్ స్టార్ట్.. వరద సాయానికి ఈసీ బ్రేక్
ALSO READ: ఆ విషయాన్ని మైండ్‌లోంచి తీసేయ్యండి.. పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశం
ALSO READ: వచ్చే ఏడు టీమిండియా బిజీ బిజీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ