కరోనా అప్‌డేట్ : 3 లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాడును కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్ర‌తిరోజు ఐదు వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. సోమ‌వారం కూడా

కరోనా అప్‌డేట్ : 3 లక్షలు దాటిన కరోనా కేసులు
Telangana Coronavirus

Updated on: Aug 10, 2020 | 8:13 PM

Tamil Nadu Crosses 3 Lakh Corona Cases : తమిళనాడును కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్ర‌తిరోజు ఐదు వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. సోమ‌వారం కూడా కొత్త‌గా 5,914 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌లు దాటి 3,02,815కు చేరింది. అందులో 2,44,675 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే మ‌రో 53,099 మంది చికిత్స పొందుతున్నారని త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ఇక మరో వైపు తమిళనాట మరణ మ‌ృదంగం కొనసాగుతూనే ఉంది. గత 15 రోజులుగా నిత్యం వంద మంది కొవిడ్-19 కారణంగా చనిపోతున్నారు. సోమ‌వారం కూడా కొత్త‌గా 114 మంది కొవిడ్ బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5,041 చేరింది.