60 ఏళ్ల నాసా ప్రస్థానంలో అద్భుతమైన ఫొటోలు

అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా 2018లో తన 60వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ ఏడాది జులైలో చంద్రుడిపై మనిషి అడుగుపెట్టి 50 ఏళ్లవుతున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోనుంది. ఈ ఆరు దశాబ్దాల అంతరిక్ష పరిశోధనలో నాసా ఎన్నో మైలురాళ్లను అందుకుంది. చంద్రుడిపై అడుగుపెట్టడమే కాదు.. మార్స్‌పైనా తొలిసారి రోవర్‌ను దించిన ఘనత నాసాదే. ఈ సందర్భంగా 400 అరుదైన, అత్యుత్తమ ఫొటోలను నాసా విడుదల చేసింది. ది నాసా ఆర్కైవ్స్: 60 ఇయర్స్ ఇన్ […]

60 ఏళ్ల నాసా ప్రస్థానంలో అద్భుతమైన ఫొటోలు

Edited By:

Updated on: Mar 03, 2019 | 5:30 PM

అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా 2018లో తన 60వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ ఏడాది జులైలో చంద్రుడిపై మనిషి అడుగుపెట్టి 50 ఏళ్లవుతున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోనుంది. ఈ ఆరు దశాబ్దాల అంతరిక్ష పరిశోధనలో నాసా ఎన్నో మైలురాళ్లను అందుకుంది. చంద్రుడిపై అడుగుపెట్టడమే కాదు.. మార్స్‌పైనా తొలిసారి రోవర్‌ను దించిన ఘనత నాసాదే. ఈ సందర్భంగా 400 అరుదైన, అత్యుత్తమ ఫొటోలను నాసా విడుదల చేసింది. ది నాసా ఆర్కైవ్స్: 60 ఇయర్స్ ఇన్ స్పేస్ పేరుతో ఉన్న బుక్‌లో ఈ ఫొటోలు నిక్షిప్తమై ఉన్నాయి.

50 ఏళ్ల కిందట చంద్రుడిపై అడుగుపెట్టిన సందర్భంలో బజ్ ఆల్‌డ్రిన్ పాదముద్రకు సంబంధించిన ఫొటో కూడా ఉంది. చంద్రుడిపై ఎలాంటి వాతావరణం లేకపోవడం వల్ల అతని అడుగు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుందని నాసా వెల్లడించింది. ఇక సౌర కుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం ముందు దాని చంద్రుడు ఎంత చిన్నగా ఉన్నాడో చెప్పేలా నాసా కాసిని స్పేస్‌క్రాఫ్ట్ తీసిన ఫొటో కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక 2015లో అరుణ గ్రహంపై దిగిన క్యూరియాసిటీ రోవర్‌కు చెందిన ఫొటోకు ఇందులో స్థానం కల్పించారు. అపోలో 17లో చంద్రుని వైపు వెళ్తూ తీసిన భూమి చిత్రం పూర్తిగా నీలిరంగులో ఉండటం కూడా ఇందులో కనిపిస్తుంది. మరెన్నో అరుదైన ఫొటోలు ఆ బుక్‌లో ఉన్నాయి.