AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 ఏళ్ళ బాలిక కిడ్నాపర్‍ అవతారం

ఓ బాలిక 11ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి తల్లిదండ్రుల్ని డబ్బు డిమాండ్ చేసింది. డబ్బు ఇవ్వకపోతే పిల్లాడు దక్కడంటూ బెదిరింపులకు దిగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో.. ఈ కిడ్నాప్ డ్రామా సుఖాంతమయ్యింది. ఈ కేసులో నిందితురాలు 17ఏళ్ల బాలికి అని తెలుసుకున్న పోలీసులు.. ఆమె చెప్పిన క్రైమ్ కహానీ విని నోరెళ్లబెట్టారట. మహారాష్ట్రలోని థానె జిల్లా శాంతినగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దంపతులు తమ కుమారుడితో నివాసముంటున్నారు. భర్త బంగారం షాపులో ఉద్యోగికాగా భార్య టైలర్‌గా పనిచేస్తోంది. […]

17 ఏళ్ళ బాలిక కిడ్నాపర్‍ అవతారం
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 03, 2019 | 5:01 PM

Share

ఓ బాలిక 11ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి తల్లిదండ్రుల్ని డబ్బు డిమాండ్ చేసింది. డబ్బు ఇవ్వకపోతే పిల్లాడు దక్కడంటూ బెదిరింపులకు దిగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో.. ఈ కిడ్నాప్ డ్రామా సుఖాంతమయ్యింది. ఈ కేసులో నిందితురాలు 17ఏళ్ల బాలికి అని తెలుసుకున్న పోలీసులు.. ఆమె చెప్పిన క్రైమ్ కహానీ విని నోరెళ్లబెట్టారట.

మహారాష్ట్రలోని థానె జిల్లా శాంతినగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దంపతులు తమ కుమారుడితో నివాసముంటున్నారు. భర్త బంగారం షాపులో ఉద్యోగికాగా భార్య టైలర్‌గా పనిచేస్తోంది. శనివారం మధ్యాహ్నం తల్లి కుమారుడ్ని ట్యూషన్‌కు పంపగా… సాయంత్రం ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. బాలుడ్ని కిడ్నాప్ చేశామని, రూ.6లక్షలు ఇస్తే వదిలేస్తామన్నది సారాంశం. ఆ డబ్బును భీవాండీలో ఉన్న శివాజీ చౌక్ దగ్గర బైకులో పెట్టి వెళ్లాలని చెప్పి ఫోన్ పెట్టేశారు. పోలీసులకు చెబితే పిల్లవాడిని అంతం చేస్తామని బెదిరించారు.

ఈ స౦ఘటనతో షాక్ తిన్న బాలుడి తల్లి.. జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకునేలోపే.. పిల్లవాడు తండ్రి పనిచేసే బంగారం షాపు దగ్గర ఏడుస్తూ కనిపించాడు. బాలుడు కనిపించడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు.. ఏం జరిగిందని ఆరా తీయగా.. గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని చెప్పుకొచ్చాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కిడ్నాపర్ చెప్పినట్లు భీవాండీలోని శివాజీ చౌక్ దగ్గర కిడ్నాప్ కోసం మాటు వేశారు. కొద్దిసేపటికి ఒకరు బురఖా వేసుకొని ఆ ప్రాంతానికి రావడాన్ని గమనించారు. ఆమెను అదుపులోకి అదుపులోకి తీసుకొని చూస్తే.. 17 ఏళ్ల బాలిక. ఆమెను చూసి షాక్ తిన్న పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. కిడ్నాప్ వ్యవహారంపై ఆరా తీయగా.. బాలుడి తల్లి దగ్గర ఆ బాలిక బట్టలు కుట్టించుకునేందుకు వెళుతుందట. పిల్లవాడిని కిడ్నాప్ చేసి డబ్బు దండుకోవాలని భావించి నేరస్థురాలిగా మిగిలిపోయింది.

Follow Us
విద్యార్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు
విద్యార్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు
నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..
నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..
AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!
AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!
ఇంట్లో ఉండే ఇదొక్క పదార్థంలో క్షణాల్లో ముఖాన్ని మెరిపించొచ్చు!
ఇంట్లో ఉండే ఇదొక్క పదార్థంలో క్షణాల్లో ముఖాన్ని మెరిపించొచ్చు!
ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు..
ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు..
న.. న.. న.. నాగుపాము.. నడకమార్గంలో బుసలు కొట్టి ఏం చేసిందంటే..
న.. న.. న.. నాగుపాము.. నడకమార్గంలో బుసలు కొట్టి ఏం చేసిందంటే..
వామ్మో.. గంభీర్ కోచింగ్‌లో ఇన్ని దారుణాలు జరిగాయా?
వామ్మో.. గంభీర్ కోచింగ్‌లో ఇన్ని దారుణాలు జరిగాయా?
జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ పూజ చేస్తే శుభయోగాలు, ఐశ్వర్యం మీ సొంతం!
జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ పూజ చేస్తే శుభయోగాలు, ఐశ్వర్యం మీ సొంతం!
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్! పెద్దలకు మాత్రమే
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్! పెద్దలకు మాత్రమే
నల్లతాచుతో మొసలి భీకర పోరాటం.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో చూస్తారా?
నల్లతాచుతో మొసలి భీకర పోరాటం.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో చూస్తారా?