AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! నడకమార్గంలో నాగుపాము.. బుసలు కొట్టి ఏం చేసిందంటే..

తిరుమల అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం వద్ద 7 అడుగుల భారీ నాగుపాము కనిపించి భక్తుల్లో భయాందోళన కలిగించింది. సమాచారం అందుకున్న టీటీడీ సెక్యూరిటీ, ఫారెస్ట్ సిబ్బంది వెంటనే స్పందించి నాగుపామును సురక్షితంగా బంధించి శేషాచలం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పాములు కనిపిస్తే వాటికి దూరంగా ఉండి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని టీటీడీ సూచించింది.

అమ్మబాబోయ్..! నడకమార్గంలో నాగుపాము.. బుసలు కొట్టి ఏం చేసిందంటే..
King Cobra Video
Raju M P R
| Edited By: |

Updated on: Jun 28, 2026 | 4:46 PM

Share

శేషాచలం అటవీ ప్రాంతంలో పాములు సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తిరుమలలో భక్తుల కంటపడి అలజడి చేస్తున్నాయి. తరచూ తిరుమల నడక మార్గంలో కనిపిస్తున్న పాములు.. భక్తులను భయపెడుతున్నాయి. తాజాగా.. తిరుమల నడక మార్గంలో ఓ భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది.. నడకమార్గం గాలిగోపురం వద్ద 7 అడుగుల నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతూ కనిపించింది. ఈ భారీ నాగుపాము అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల కొండ మెట్లు ఎక్కుతున్న భక్తుల కంటపడింది.

ఈ 7 అడుగుల పొడవైన భారీ నాగుపామును చూసి భయపడ్డ భక్తులు పరుగులు పెట్టారు. అనంతరం గాలిగోపురం వద్ద ఉన్న టిటిడి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది టీటీడీ ఫారెస్ట్ విభాగంలో పాములు పట్టే కాంట్రాక్టు ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు 7 అడుగుల నాగుపామును చాకచక్యంగా బంధించారు. అనంతరం సేఫ్ గా నాగుపామును శేషాచలం కొండల్లో వదిలి పెట్టారు. దీంతో నడకదారి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

అయితే.. తిరుమల ప్రాంతంలో పాములు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని.. వాటి దగ్గరకు వెళ్లవద్దని సెక్యూరిటీ సిబ్బంది సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us