AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasar Bharatiలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.1.25 లక్షల జీతంతో భారీ అవకాశం

Prasar Bharati Recruitment 2026 Notification: ప్రభుత్వ మీడియా రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ప్రసార్ భారతి విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం కరస్పాండెంట్, సీనియర్ కరస్పాండెంట్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. అర్హతలు కలిగిన వారు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి..

Prasar Bharatiలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.1.25 లక్షల జీతంతో భారీ అవకాశం
Prasar Bharati Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 28, 2026 | 2:37 PM

Share

భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ఆధ్వర్యంలోని ప్రసార్ భారతి దూరదర్శన్‌ కేంద్ర.. వివిధ ప్రాంతీయ వార్తా విభాగాలలో (RNU) ఒప్పంద ప్రాతిపదికన కరస్పాండెంట్, సీనియర్ కరస్పాండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ఉద్యోగం పొందిన అభ్యర్ధులకు నెలకు ఏకంగా రూ.1,20,000 వరకు జీతం పొందొచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 9, 2026వ తేదీతోను ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు

  • కరస్పాండెంట్ పోస్టుల సంఖ్య: 4
  • సీనియర్ కరస్పాండెంట్ పోస్టుల సంఖ్య: 1

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ (జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్) విభాగంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ఉద్యోగానుభవం కూడ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 9, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు కరస్పాండెంట్ పోస్టులకు రూ.60,000 నుంచి రూ.80,000 వరకు, సీనియర్ కరస్పాండెంట్ పోస్టులకు రూ. 80,000 నుంచి రూ.1,25,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ లింక్ ద్వారా తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

ప్రసార్ భారతిలో ఉద్యోగాలకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us