జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం

జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఈసారికి బ్యాలెట్‌ ద్వారానే ఓటింగ్‌ జరపాలని నిర్ణయించింది. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం

Updated on: Oct 05, 2020 | 4:50 PM

Ghmc Elections : జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఈసారికి బ్యాలెట్‌ ద్వారానే ఓటింగ్‌ జరపాలని నిర్ణయించింది. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. మిగిలిన చోట్ల కూడా బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేసింది.

అయితే గ్రేటర్‌ ఎన్నికలను ఈవీఎం ద్వారానే నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్,ఎంఐఎం బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తేనే కరోనా టైమ్‌లో బెటరని స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌ మాత్రం ఈవీఎం, బ్యాలెట్‌ ద్వారా లాభనష్టాలు ఏంటో చెప్పాలని ఎస్ఈసీకి లేఖ రాసింది. ఇలా అన్ని పార్టీల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయాలు తీసుకుంది. ఆ తర్వాతే చివరకు బ్యాలెట్‌ పద్ధతికే ఓకే చెప్పింది.