బిగ్ బ్రేకింగ్: జనవరి 20 నుంచి ఏపీ స్పెషల్ సెషన్

|

Jan 13, 2020 | 5:27 PM

మూడు రాజధానులను ప్రతిపాదించినప్పట్నించి ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అత్యంత కీలకమైన ఏపీ రాజధాని అంశాన్ని చర్చించేందుకు జనవరి 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ కార్యదర్శులకు లేఖలు రాసింది. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున మూడు రాజధానులుండే చాన్స్ వుందని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆ దిశగా మాట తప్పను.. మడమ తిప్పను […]

బిగ్ బ్రేకింగ్: జనవరి 20 నుంచి ఏపీ స్పెషల్ సెషన్
Follow us on

మూడు రాజధానులను ప్రతిపాదించినప్పట్నించి ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అత్యంత కీలకమైన ఏపీ రాజధాని అంశాన్ని చర్చించేందుకు జనవరి 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ కార్యదర్శులకు లేఖలు రాసింది.

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున మూడు రాజధానులుండే చాన్స్ వుందని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆ దిశగా మాట తప్పను.. మడమ తిప్పను అన్న లెవెల్‌లో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నాలుగు రోజులకు బీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వడం.. ఆ తర్వాత వారం రోజులకు ఏపీ కేబినెట్ భేటీ అయ్యి మూడు రాజధానుల ప్రతిపాదనపై లోతుగా చర్చించడం.. ఆ తర్వాత రాజధాని అంశంపై అధ్యయనం చేసిన కమిటీల నివేదికల అధ్యయనానికి హైపవర్ కమిటీని నియమించడం.. ఆ తర్వాత జనవరి 3న బోస్టన్ గ్రూపు నివేదిక రావడం.. ఇలా చకచకా పరిణామాలు జరిగిపోయాయి.

హైపవర్ కమిటీ ఇప్పటికి మూడు సార్లు భేటీ అయ్యింది. తాజాగా సోమవారం సమావేశమై 17వ తేదీ దాకా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆ తర్వాత నివేదిక రూపొందించి ముఖ్యమంత్రికి నివేదిస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. సో.. 17న తుది విడతగా సమావేశం కాబోతున్న హైపవర్ కమిటీ ఆ తర్వాత ఏ క్షణమైన ముఖ్యమంత్రికి నివేదిక అందించే అవకాశాలున్నాయి. దానిపై ఇదమిత్తంగా ఒక నిర్ణయానికి రానున్న ముఖ్యమంత్రి ఫైనల్ డెసిషన్ అసెంబ్లీ సమావేశాల్లోనే వెల్లడించి, ఆ వెంటనే ఆమోదం పొందేందుకు సిద్దమవుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

జనవరి 20, 21,22 తేదీలలో ఏపీ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశం కాబోతోంది. ఈ లెక్కన రిపబ్లిక్ డే కంటే ముందే ఏపీ క్యాపిటల్ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. జనవరి 29 నుంచి విశాఖనే ఏపీ క్యాపిటల్ అంటూ వస్తున్న కథనాలకు తాజా పరిణామాలు బలం చేకూర్తుస్తున్నాయి.