రోజుకు 9 గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నారా..?

|

Jan 24, 2020 | 10:57 PM

పనికి తగ్గ పేమెంట్, ఓటీ చేస్తే ఎక్స్‌ట్రా మనీ..మీ పనిని బట్టి హైక్ ఉంటుంది.. అనగానే ఎగబడిపోయి ఎక్కువ సమయం పనిచేస్తున్నారా..?. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే. బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన షాకింగ్ విషయాలు వెల్లడించింది. తొమ్మిది గంటలకు పైగా వర్క్ చేస్తే..అనేక అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు పరిశోధకులు. అలాంటివారు సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే త్వరగా మరణిస్తారట. అయితే దీనికి వారు కొన్ని పరిష్కారాలు కూడా చెప్తున్నారు. రోజూ 24 నిమిషాలు వాకింగ్ […]

రోజుకు 9 గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నారా..?
Follow us on

పనికి తగ్గ పేమెంట్, ఓటీ చేస్తే ఎక్స్‌ట్రా మనీ..మీ పనిని బట్టి హైక్ ఉంటుంది.. అనగానే ఎగబడిపోయి ఎక్కువ సమయం పనిచేస్తున్నారా..?. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే. బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన షాకింగ్ విషయాలు వెల్లడించింది. తొమ్మిది గంటలకు పైగా వర్క్ చేస్తే..అనేక అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు పరిశోధకులు. అలాంటివారు సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే త్వరగా మరణిస్తారట. అయితే దీనికి వారు కొన్ని పరిష్కారాలు కూడా చెప్తున్నారు. రోజూ 24 నిమిషాలు వాకింగ్ చేస్తే..మరణించే ప్రమాదం తగ్గుతుందని వారు చెప్తున్నారు. ఆఫీసుల్లో కూర్చుని సిస్టమ్స్ ముందు పనిచేసేవారు..సాధారణంగా ఎక్కువ కదలరు. కుర్చీలకే అతుక్కుపోయి కూర్చుంటారు. దీనివల్ల శరీరంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అంతేకాదు సరౌండింగ్స్ అన్ని క్లోజ్ చేసి ఉంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించదు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఆఫీసులో కూర్చోని పనిచేసేవారు రోజుకు ఒక గంటపాటు నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.