కమలం గూటికి.. షాహీన్‌ బాగ్‌ ఆందోళనకారులు..!

| Edited By:

Aug 16, 2020 | 8:26 PM

దేశ రాజధాని ఢిల్లీ షాహీన్‌ బాగ్‌ ప్రాంతం గురించి తెలిసిందే. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. అందులో..

కమలం గూటికి.. షాహీన్‌ బాగ్‌ ఆందోళనకారులు..!
Follow us on

దేశ రాజధాని ఢిల్లీ షాహీన్‌ బాగ్‌ ప్రాంతం గురించి తెలిసిందే. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. అందులో ముఖ్యంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో రోజుల కొద్ది ఆందోళనలు కొనసాగాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే ఈ
ఆందోళనలో పాల్గొన్న సామాజిక కార్యకర్త షాజాద్ అలీ కమలం గూటికి చేరుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా.. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా, పార్టీ నేత శ్యామ్ జాజు సమక్షంలో కమలం గూటికి చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన షాజాద్‌ అలీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మన శత్రువంటూ దేశంలోని చాలా మంది ముస్లింలు నమ్ముతుంటారని.. అది తప్పని నిరూపించేందుకు తాను కమలం గూటికి చేరినట్లు తెలిపారు.

Read More :

ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు