భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

| Edited By:

Jun 20, 2019 | 4:17 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 488 పాయింట్లు లాభపడి 39,601 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు లాభపడి 11,831 వద్ద ట్రేడయ్యాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే వార్తలు మార్కెట్లో జోరును నింపాయి. మరో పక్క డేటా లోకలైజేషన్‌ చేయమనే దేశాల కంపెనీలకు అవసరమైన హెచ్‌1బీ వీసాలపై అమెరికా నియంత్రణ విధిస్తుందనే వార్తలు వచ్చాయి. దీంతో కేవలం టెక్‌ కంపెనీల షేర్లు మాత్రమే నష్టపోయాయి. యస్‌బ్యాంక్‌ షేర్లు 12శాతం లాభపడ్డాయి. సన్‌ఫార్మా, […]

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Follow us on

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 488 పాయింట్లు లాభపడి 39,601 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు లాభపడి 11,831 వద్ద ట్రేడయ్యాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే వార్తలు మార్కెట్లో జోరును నింపాయి. మరో పక్క డేటా లోకలైజేషన్‌ చేయమనే దేశాల కంపెనీలకు అవసరమైన హెచ్‌1బీ వీసాలపై అమెరికా నియంత్రణ విధిస్తుందనే వార్తలు వచ్చాయి. దీంతో కేవలం టెక్‌ కంపెనీల షేర్లు మాత్రమే నష్టపోయాయి. యస్‌బ్యాంక్‌ షేర్లు 12శాతం లాభపడ్డాయి. సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీలు భారీగా లాభపడ్డాయి. హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 69.56 వద్ద నిలకడగా ఉంది.