AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుణెలో ఒక్కరోజే కొత్తగా 1,491 మందికి కరోనా

మహారాష్ట్రలో కరోనా వికృతరూపం దాల్చుతోంది. రోజు రోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయి కేసులు నమోదైన పుణేలో రెండో దఫా లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు.

పుణెలో ఒక్కరోజే కొత్తగా 1,491 మందికి కరోనా
Balaraju Goud
|

Updated on: Jul 15, 2020 | 8:23 PM

Share

మహారాష్ట్రలో కరోనా వికృతరూపం దాల్చుతోంది. రోజు రోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయి కేసులు నమోదైన పుణేలో రెండో దఫా లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు.

పుణె జిల్లాలో కరోనా తీవ్రత తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఉద్ధవ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఒక్కరోజు పుణే జిల్లాలో దాదాపు 1,500 కేసులు వెలుగు చూశాయి. దీంతో పుణెలో రెండో విడత లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. జూలై 18 నుంచి జూలై 23 వరకూ పుణెలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో జనం బయటకు రాకుండా కట్టడి చేయాలని నిర్ణయించారు. అయితే, హాస్పిటల్స్, మెడికల్ స్టోర్స్, మిల్క్ డైరీలు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. పుణె జిల్లాలో కొత్తగా 1,491 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో.. 690 కేసులు పుణె నగరంలోనే నమోదు కావడం విశేషం. ఇప్పటివరకు పుణె జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 28,676 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.

అటు, మహారాష్ట్రలో కరోనా మహమ్మారికి మరో 233 మంది మరణించారు. తాజాగా విడుదల చేసిన బులిటిన్‌లో ఆ రాష్ట్రంలో కొత్తగా 7,975 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,75,640కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో 10,928 మంది మృతి చెందారు.3606 మంది రోగులు డిశ్చార్జి కాగా 1,52,613 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు వెల్లడించారు.

Follow Us
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? జాబితా వైరల్
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? జాబితా వైరల్
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..
గేమింగ్ యాప్ వేదికగా ‘లవ్ జిహాద్’ వల!
గేమింగ్ యాప్ వేదికగా ‘లవ్ జిహాద్’ వల!
ఉడిపి స్టైల్ కొబ్బరి–కొత్తిమీర చట్నీ.. ఇలా చేసి తిన్నారంటే మైమరిచ
ఉడిపి స్టైల్ కొబ్బరి–కొత్తిమీర చట్నీ.. ఇలా చేసి తిన్నారంటే మైమరిచ
మీ చేతి వేళ్ల పొడవుతో మీరెలాంటి వారో చెప్పేయొచ్చు..
మీ చేతి వేళ్ల పొడవుతో మీరెలాంటి వారో చెప్పేయొచ్చు..