AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈనెల 11న జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు పరిశీలకుడి నియామకం

జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శుక్రవారం పరిశీలకుడిని నియమించింది.

ఈనెల 11న జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం..  మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు పరిశీలకుడి నియామకం
Balaraju Goud
|

Updated on: Feb 05, 2021 | 5:11 PM

Share

GHMC Mayor Election Observer : ఈనెల 11న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా నిర్వహిస్తున్నారు. దీంతో మేయర్ పీఠం కోసం పలువురు మహిళా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు, జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శుక్రవారం పరిశీలకుడిని నియమించింది. సీనియర్‌ ఐఏఎస్ అధికారి‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియాను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల చేత ఆయన ప్రమాణస్వీకారం చేయిస్తారు. అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపతారు. అయితే మేయర్ సీటును ఈసారి జనరల్ మహిళకు కేటాయించి విషయం తెలిసిందే.

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలో 150 వార్డులకు గతేడాది డిసెంబర్‌ 1న ఎన్నికలు జరిగాయి. 4న ఫలితాలు వెలువడ్డాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు 56 వార్డులు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 48 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం 44 స్థానాలు కైవసం చేసుకుని పాతబస్తీలో మరోసారి తిరుగులేదనిపించింది.. కాంగ్రెస్‌ పార్టీ రెండు సీట్లకే పరిమితమై చతికిలపడింది.

కాగా, ఈసారి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు పోటీ భారీగానే ఉంది. అయితే అత్యధిక స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి ఎక్స్ అఫీషియో సభ్యులు జత కలుస్తుండటంతో మేయర్ ఎన్నిక లాంఛనం కానుంది. ఇదిలావుంటే, టీఆర్ఎస్‌తో పొత్తులో భాగంగా మజ్లిస్ పార్టీ డిప్యూటీ మేయర్ స్థానం తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also…  మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్.. దారి తప్పిన ఓ వ్యక్తికి తానే దిక్కయ్యాడు.. ఆకలి తీర్చి.. గమ్యం చేర్చాడు..!