No Lock-down కరోనా అంటే వారికి భయంలేదు.. యధేచ్ఛగా.!

|

Apr 02, 2020 | 4:16 PM

కరోనా భయంతో దేశ ప్రజలు ఓ వైపు వణికిపోతుంటే కొందరు అక్రమార్కులకు మాత్రం ఏ మాత్రం భయం కలుగట్లేదు. సరికదా.. యధేచ్ఛగా తమ అక్రమాలను కొనసాగిస్తూనే వున్నారు.

No Lock-down కరోనా అంటే వారికి భయంలేదు.. యధేచ్ఛగా.!
Follow us on

Illegal mining continuing in Andhra Pradesh: కరోనా భయంతో దేశ ప్రజలు ఓ వైపు వణికిపోతుంటే కొందరు అక్రమార్కులకు మాత్రం ఏ మాత్రం భయం కలుగట్లేదు. సరికదా.. యధేచ్ఛగా తమ అక్రమాలను కొనసాగిస్తూనే వున్నారు. తాజాగా ఇలాంటి ఉదంతమొకటి వెలుగు చూసింది ఏపీలోని కృష్ణా జిల్లా మద్దూరులో. టీడీపీ నేతలతో పాటు స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో మైనింగ్ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం.

లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం ద్వారా కరోనాని నియంత్రిస్తే… ఏప్రిల్ 15 తర్వాత లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలు లేవని ఓ వైపు ప్రధాన మంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హామీ ఇస్తే.. మరోవైపు అక్రమార్కులు లాక్ డౌన్ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ కృష్ణా జిల్లా మద్దూరులో వెలుగు చూసింది.

మద్దూరు ఇసుక రీచ్‌లో దోపిడీ యధేచ్ఛగా కొనసాగిస్తున్న విషయం తాజాగా వెలుగు చూసింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలింపు కొనసాగుతోందని తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్‌ను సైతం పట్టించుకోని సాండ్ మాఫియా తమ అక్రమ కార్యకలాపాలను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. మిషనరీతో ఇసుకను ట్రాక్టర్లు, లారీల్లోకి లోడింగ్ చేస్తున్నమాఫియాకు సంబంధించిన వీడియోలు, ఫోటోలకు టీడీపీ నేత బోడె ప్రసాద్ మైనింగ్ ఎండీకి ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ నేతల ఫిర్యాదులపై అధికారులు పెద్దగా స్పందించనట్లు సమాచారం. ఆ తర్వాత మరికొందరు సామాన్యులు కూడా ఫిర్యాదులు ప్రారంభించడంతో అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.