ఏపీ ప్రభుత్వానికి రూ.100కోట్ల జరిమానా

| Edited By:

Apr 04, 2019 | 3:04 PM

ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు రూ.100కోట్ల జరిమానాను విధించింది. కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వుతున్నారని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ కోర్టు ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానాను విధించింది. తదుపరి విచారణను […]

ఏపీ ప్రభుత్వానికి రూ.100కోట్ల జరిమానా
Follow us on

ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు రూ.100కోట్ల జరిమానాను విధించింది. కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వుతున్నారని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ కోర్టు ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానాను విధించింది. తదుపరి విచారణను జులై 23కు వాయిదా వేసింది.