బ్రేకింగ్: ఎన్‌కౌంటర్‌పై విచారణ షురూ

|

Dec 16, 2019 | 4:56 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్యకేసులో నేరస్థుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి విచారణ ప్రారంభమైంది. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సూ-మోటోగా స్పందించిన సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం నియమించిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ జడ్జి విఎస్ సిర్పూర్కర్, రేఖా బల్డొటా, కార్తికేయన్‌లతో కూడిన సుప్రీం త్రిసభ్య కమిటీ సోమవారం తమ విధులకు శ్రీకారం చుట్టింది. ముందుగా కేసు పూర్వాపరాలను పరిశీలించేందుకు మొత్తం కేసు డైరీని తెప్పించుకున్నారు త్రిసభ్య […]

బ్రేకింగ్: ఎన్‌కౌంటర్‌పై విచారణ షురూ
Follow us on

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్యకేసులో నేరస్థుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి విచారణ ప్రారంభమైంది. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సూ-మోటోగా స్పందించిన సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం నియమించిన సంగతి తెలిసిందే.

రిటైర్డ్ జడ్జి విఎస్ సిర్పూర్కర్, రేఖా బల్డొటా, కార్తికేయన్‌లతో కూడిన సుప్రీం త్రిసభ్య కమిటీ సోమవారం తమ విధులకు శ్రీకారం చుట్టింది. ముందుగా కేసు పూర్వాపరాలను పరిశీలించేందుకు మొత్తం కేసు డైరీని తెప్పించుకున్నారు త్రిసభ్య కమిటీ సభ్యులు. దిశ కేసు వివరాలు, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితుల వివరాలను త్రిసభ్య కమిటీ పరిశీలించింది. ఎన్.హెచ్.ఆర్.సీ. బృందం సేకరించిన వివరాలను తమకు ఇవ్వాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌ను త్రిసభ్య కమిటీ కోరినట్లు సమాచారం.

కాగా.. త్రిసభ్య కమిటీ మరో మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి రాక ఖరారు కావడంతో త్రిసభ్య కమిటీకి అవసరమైన వివరాలు ఇచ్చేందుకు, వారికి సంబంధించిన అన్ని పనులు చూసుకునేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఓ అధికారుల బృందాన్ని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.