#COVID19 రిలయన్స్ సంస్థ షాకింగ్ డెసిషన్

|

Mar 23, 2020 | 5:28 PM

దేశమంతా కరోనా భయంతో వణికిపోతున్న సమయంలో రిలయన్స్ సంస్థ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో అతిపెద్ద వ్యాపార, వాణిజ్య సంస్థ ఏ నిర్ణయం తీసుకున్న అది పెద్ద వార్తే. కానీ..

#COVID19 రిలయన్స్ సంస్థ షాకింగ్ డెసిషన్
Follow us on

Reliance organisation shocking decision: దేశమంతా కరోనా భయంతో వణికిపోతున్న సమయంలో రిలయన్స్ సంస్థ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో అతిపెద్ద వ్యాపార, వాణిజ్య సంస్థ ఏ నిర్ణయం తీసుకున్న అది పెద్ద వార్తే. కానీ.. కరోనా వైరస్ తో యావత్ దేశ ప్రజలు భయాందోళన చెందుతున్న తరుణంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య గంట గంటకి పెరుగుతోంది. ప్రస్తుతం (మార్చ్ 23 సా. 5 గం.లకు) దేశంలో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 మంది మృతి చెందారు. అయితే ఆనందించాల్సిన విషయం ఏమిటంటే.. కరోనా పాజిటివ్ గా రికార్డు అయ్యి.. ట్రీట్ మెంట్ తర్వాత డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది.

ఈ నేపథ్యంలో ప్రాణాంతక కరోనా నుంచి మనం బయట పడగలం అన్న నమ్మకం పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా నియంత్రణ చర్యల్లో పాలుపంచుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ కోవలో వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కూడా చేరారు. కరోనా బాధితులను తరలించేందుకు, వారి చికిత్సకు అవసరం అయ్యే పరికరాల తరలింపునకు వినియోగించే వాహనాలు దేశంలోని అన్ని రిలయన్స్ ఫ్యూయల్ స్టేషన్లలో ఉచితంగా ఫ్యూయల్ నింపుతామని రిలయన్స్ అధినేత ప్రకటించారు.

రిలయన్స్ సంస్థల్లో పని చేసే కాంట్రాక్టు, టెంపరరీ వర్కర్స్ అందరికి జీతాలు, వేతనాలు చెల్లిస్తామని.. కరోనా వైరస్ సృష్టించిన ఈ క్రైసిస్ లో ఉద్యోగులు విధి నిర్వహణకు రాకపోయినా కూడా వారికి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. దేశంలోని పలు నగరాలలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది రిలయన్స్ సంస్థ. అదే సమయంలో ముఖానికి ధరించే మాస్కుల తయారీని మార్చ్ 24 నుంచి పెంచుతామని, ఒక్కో రోజుకు లక్ష మేరకు అదనంగా మాస్కులను ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది రిలయన్స్ సంస్థ.