విజయవాడ స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యంను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. పోలీసుల విచారణలో సత్యం పలు విస్తుగొలిపే నిజాలను వెల్లడించాడు. హైదరబాద్ పంజాగుట్ట వద్ద రెక్కీ నిర్వహించి హత్యకు ప్లాన్ చేసినట్టుగా ఒప్పుకున్నాడు. హత్యకు ముందు రాంప్రసాద్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద కూడా దాదాపు 30 సార్లు రెక్కీ జరిపినట్టుగా అంగీకరరించాడు. తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా విదేశాలకు వెళ్లిపోడానికి సిద్ధం కావడంతోనే హత్యచేసినట్టుగా కోగంటి సత్యం పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ప్రధాన నిందితుడు సత్యంతో పాటు 8 మందిని మూడు రోజులపాటు పోలీసులు విచారించారు.