AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ కేబినెట్‌లో మగాడే లేడు! రామ రామా..రామకృష్ణ ఎంత మాటన్నారు?

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న నేతలు తమ నోటికి పదును పెడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఘాటైన పదజాలాన్ని వాడుతున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో బుధవారం జరిగిన అమరావతి పరిరక్షణ జెఎసీ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ మంత్రులపై పదునైన పదజాలంతో విరుచుకుపడ్డారు. రాజధాని ఉద్యమానికి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుందని ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ఆరోపించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ […]

ఏపీ కేబినెట్‌లో మగాడే లేడు! రామ రామా..రామకృష్ణ ఎంత మాటన్నారు?
Rajesh Sharma
|

Updated on: Jan 08, 2020 | 7:21 PM

Share

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న నేతలు తమ నోటికి పదును పెడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఘాటైన పదజాలాన్ని వాడుతున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో బుధవారం జరిగిన అమరావతి పరిరక్షణ జెఎసీ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ మంత్రులపై పదునైన పదజాలంతో విరుచుకుపడ్డారు.

రాజధాని ఉద్యమానికి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుందని ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ఆరోపించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నోటికి పని చెప్పారు. జగన్ కేబినెట్‌లో మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలని, వారిలో మాట్లాడేందుకు ఒక్క మగాడు కూడా లేడని రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి రాజధానిపై ప్రకటనలు చేస్తుంటే మంత్రులు కనీసం ప్రశ్నించలేకపోతున్నారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ ఇద్దరు అనుకుంటే చాలా రాజధానిని ఎక్కడికైనా మార్చేస్తారా అని ప్రశ్నించారు రామకృష్ణ. రాష్ట్ర హైకోర్టును మూడు ముక్కలు చేస్తే రాయలసీమ బాగుపడదని అన్నారాయన. రాయలసీమకు నీళ్లు ఇస్తే ఆ ప్రాంతం బాగుపడుతుందని చెప్పారు. రాష్ట్ర రాజధానిని మారుస్తున్న విషయం కనీసం అయిదుగురు ఉప ముఖ్యమంత్రులకైనా తెలుసా అని నిలదీశారు రామకృష్ణ

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే