AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆప్‌తో పొత్తుకు రాహుల్ కసరత్తులు

న్యూఢిల్లీ: 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జాతీయ స్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. ఉప్పు, నిప్పులా ఉన్న పార్టీలు కూడా జత కట్టేందుకు సిద్ధమౌతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెరస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. గతంలో ఈ రెండు పార్టీలకు అస్సలు పడేది కాదు. గత నెల ప్రారంభంలో కూడా కాంగ్రెస్, ఆప్‌ల పొత్తుపై అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. కానీ ఇప్పుడు […]

ఆప్‌తో పొత్తుకు రాహుల్ కసరత్తులు
Vijay K
|

Updated on: Mar 05, 2019 | 3:00 PM

Share

న్యూఢిల్లీ: 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జాతీయ స్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. ఉప్పు, నిప్పులా ఉన్న పార్టీలు కూడా జత కట్టేందుకు సిద్ధమౌతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెరస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. గతంలో ఈ రెండు పార్టీలకు అస్సలు పడేది కాదు. గత నెల ప్రారంభంలో కూడా కాంగ్రెస్, ఆప్‌ల పొత్తుపై అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు అలా లేవు.

ఢిల్లీలో మొత్తం 7 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే అందులో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు కోరుతుండగా, రెండే ఇచ్చేందుకు ఆప్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారట. బీజేపీని ఎక్కడికక్కడ నిలువరించి వీలైనంత బలం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకే పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని సీట్లు సర్దుబాటు చేసుకుంటోంది.

Follow Us