ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. సింధు తల్లి విజయ, ఇతర కుటుంబసభ్యులు టీవీలో మ్యాచ్‌ను వీక్షించారు. సింధు విజయం సాధించిన అనంతరం వారంతా ఒకరినొకరు అభినందించుకుంటూ స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింధు విజయ ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణిపై గెలవడం టర్నింగ్ పాయింట్ అని ఆమె వివరించారు. ఆ మ్యాచ్‌లో తొలి సెట్‌లో సింధు సరిగా రాణించలేదని.. అయితే మిగతా రెండు సెట్లలో తిరిగి పుంజుకుని సత్తా చాటిందన్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ కోసం సింధు గత ఆరునెలలుగా తీవ్రస్థాయిలో సాధన చేసిందని తెలిపారు.