రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇవాళ నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 9.40 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి రాష్ట్రపతి చేరుకోనున్నారు. అనంతరం వెంకటాచలం అక్షర విద్యాలయంలో పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నం 12.15 గంటలకు రేణిగుంటకు బయల్దేరి వెళ్లనున్నారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరులో పర్యటిస్తుండడం, ఇవాళ రాష్ట్రపతి కూడా రానుండడంతో పోలీసులు భారీగా మోహరించారు. అడుగడునా తనిఖీలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.