విజయవాడః ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిని కేఏ పాల్ కోరారు. తమ పార్టీ బీ ఫామ్‌లను టీడీపీ, వైసీపీ పార్టీలు దొంగిలించాయని, కాబట్టి ఎన్నికలను వాయిదా వేయాలని ఆయన ద్వివేదికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఫామ్‌లు ఎత్తుకెళ్లడం ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు మళ్లీ బీజేపీతో కలుస్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు ఫెయిలయ్యారని పాల్ అన్నారు. తనను కాపాడుకోలేని చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు? జగన్‌కు అధికారం ఇస్తే రాష్ట్రం రావణకాష్టంలా మారుతుంది అంటూ పాల్ విమర్శలు చేశారు.