గుహవాటి : అసోంలో మరోసారి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ధలిగాన్ ప్రాంతంలో పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో పాలిథీన్ సంచుల్లో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 29 బ్యాగుల్లో తరలిస్తున్న 700కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అగర్తల నుంచి ఈ గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.