లాక్ డౌన్ మంచి ఫలితాలనిచ్చింది.. ప్రధాని మోదీ

| Edited By: Anil kumar poka

Apr 27, 2020 | 1:45 PM

దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్ డౌన్ మంచి ఫలితాలనిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. లాక్ డౌన్ విషయంలో అన్ని రాష్ట్రాలూ కేంద్రానికి సహకరించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. సోమవారం  తొమ్మిది రాష్ట్రాల సీఎం లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన..

లాక్ డౌన్ మంచి ఫలితాలనిచ్చింది.. ప్రధాని మోదీ
Follow us on

దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్ డౌన్ మంచి ఫలితాలనిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. లాక్ డౌన్ విషయంలో అన్ని రాష్ట్రాలూ కేంద్రానికి సహకరించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. సోమవారం  తొమ్మిది రాష్ట్రాల సీఎం లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన.. వలస కార్మికులను దశల వారీగా వారి వారి స్వస్థలాలకు పంపేందుకు తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేయాలని  కోరారు. ప్రధానంగా లాక్ డౌన్ పొడిగింపు సమీక్ష ఎజెండాగా ఈ సమావేశం సాగుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ , తన బదులు తమ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని కోరారు.  ఇవ్వాల్టి మీటింగ్ ఫోకస్ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినదని, అన్ని రాష్ట్రాలూ తప్పనిసరిగా హాజరు కావలసిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా హోం మంత్రి అమిత్ షా.. నిన్ననే విజయన్ తో ఫోన్  లో మాట్లాడి లాక్ డౌన్ సమీక్షకు సంబంధించి తగిన సూచనలు పంపాలని కోరారు.

ఈ నెల 20 న  కేంద్రం ప్రకటించిన పాక్షిక సడలింపుల పైన.. తాజా పరిస్థితి పైన ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని వారు కోరుతున్నారు.ఫిసికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ యాక్ట్ ని సవరించి ద్రవ్య లోటుకు కళ్లెం వేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. బీహార్, ఒడిశా, గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్ఛేరి ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.