పెట్రోల్, డీజిల్ ధరల మోత.. తొమ్మిది రోజుల్లో రూ.5 పెంపు..

| Edited By:

Jun 15, 2020 | 10:24 AM

దేశవ్యాప్తంగా వరుసగా తొమ్మిదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 12 వారాల షట్‌డౌన్ అనంతరం చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా సోమవారం మరో 50 పైసల చొప్పున పెరగడంతో.....

పెట్రోల్, డీజిల్ ధరల మోత.. తొమ్మిది రోజుల్లో రూ.5 పెంపు..
Follow us on

దేశవ్యాప్తంగా వరుసగా తొమ్మిదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 12 వారాల షట్‌డౌన్ అనంతరం చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా సోమవారం మరో 50 పైసల చొప్పున పెరగడంతో.. తెలంగాణ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.17, లీటర్ డీజిల్ ధరపై  రూ.72.93గా ఉంది. కాగా గత తొమ్మిది రోజుల్లో చమురు ధరలు ఐదు రూపాయల వరకూ పెరిగింది. అలాగే డీజిల్‌పై 4.87 పెరిగింది ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రజలకు ఈ పెరిగిన పెట్రోల్ ధరలతో మరింత ఆందోళన చెందుతున్నారు.

ఇక అటు అంతర్జాతీయంగా కూడా చమురు ధరలు పడిపోయాయి. చివరిసారిగా మార్చి 16న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి ఆయిల్ కంపెనీలు. ఆ తర్వాత మళ్లీ చమురు ధరలు పెరగలేదు. ఇప్పుడు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్న నేపథ్యంలో ఆయిల్‌ ధరలకు డిమాండ్ పెరిగింది. కాాగా దేశ వ్యాప్తంగా స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలు వల్లే ఆయా చోట్లలో ధరల్లో మార్పు ఉంటోందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.

ప్రముఖ నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు:

– హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్ రూ.79.17, డీజిల్ రూ.72.93
– అమరావతిలో పెట్రోల్ లీటర్ రూ.78.95, డీజిల్ రూ.72.81
– న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.76.26, డీజిల్ రూ.74.62
– ముంబైలో పెట్రోల్ లీటర్ రూ.83.17, డీజిల్ రూ.80.70

Read More: 

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి

ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్…