విజయవాడ: విజయవాడ పటమటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా స్వాగతిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ‘ఈవీఎంలు చాలాచోట్ల పని చేయడం లేదని.. దీనిపై ఎన్నికల అధికారులతో తమ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని’ తెలిపారు.