మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారా… లేకుంటే ఇక అంతే…

మీకు పాన్ కార్డు ఉందా...? దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేశారా..? ఇంకా చేయలేదా...? అయితే మీరు ఒక సారి ఇది తప్పకుండా చదవాల్సిందే.....

మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారా... లేకుంటే ఇక అంతే...

Updated on: Jun 12, 2020 | 3:37 PM

మీకు పాన్ కార్డు ఉందా…? దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేశారా..? ఇంకా చేయలేదా…? అయితే మీరు ఒక సారి ఇది తప్పకుండా చదవాల్సిందే…. లేదంటే మీరు పెద్ద సమస్యలో చిక్కుకుంటున్నట్లే.

మన డాక్యుమెంట్లలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ చాలా కీలకమైనవి. పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తే… ఆధార్ కార్డ్‌ను యూఐడీఏఐ జారీ చేస్తుంది. అయితే ఈ రెండు కార్డులను కచ్ఛితంగా అనుసంధానం చేసుకోవాలని కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పాన్, ఆధార్ అనుసంధాన గడువును చాలా సార్లు పొడిగించుకుంటూ వచ్చింది.

అయితే ఇప్పుడు ఆ గడువు కూడా ముగింపుకు చేరుకుంటోంది. ఈ నెల 30తో డెడ్ లైన్‌ ముగుస్తుంది. ఆలోగా ఆధార్‌తో‌ అనుసంధానించుకోని పక్షంలో… పాన్ కార్డు రద్దవుతుంది. రద్దు అయిన పాన్ కార్డులను వాడితే… రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తారు. మరి మీరు చేయవల్సిందల్లా… మీ ఆధార్‌తో పాన్ కార్డ్‌ లింక్ అయిందో.. లేదో.. తెలుసుకోవడమే…