కరోనా ఎఫెక్ట్.. కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం

| Edited By:

Mar 23, 2020 | 4:58 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుండటంతో.. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుటోంది. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 33 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అయితే వీరిలో ఎవరికి కూడా ప్రమాదం లేదని తెలిపారు. కాగా.. మంగళవారం నుంచి రిఫరల్ ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లాంటి ఆస్పత్రల్లో ఔట్ పేషంట్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అత్యవసరం కాని ఆపరేషన్లను నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు స్థానికులకు ఒకరికి […]

కరోనా ఎఫెక్ట్.. కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుండటంతో.. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుటోంది. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 33 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అయితే వీరిలో ఎవరికి కూడా ప్రమాదం లేదని తెలిపారు. కాగా.. మంగళవారం నుంచి రిఫరల్ ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లాంటి ఆస్పత్రల్లో ఔట్ పేషంట్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అత్యవసరం కాని ఆపరేషన్లను నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు స్థానికులకు ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని అన్నారు.

ఇక ఇప్పటికే ఐదు జిల్లాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక పోలీసులు కూడా లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపైకి వాహనాలను తీసుకొస్తే.. సీజ్ చేయనున్నట్లు పోలీసులు హెచ్చరించారు. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడరాదని ఆదేశాలు జారీచేశారు.